Instagram: క్రాష్ అయిన ఇన్ స్టాగ్రామ్.. తీవ్రంగా ఇబ్బందిపడ్డ యూజర్లు!

  • మొబైల్, డెస్క్ టాప్ లో స్తంభించిన యాప్
  • జోకులు పేల్చుతున్న యూజర్లు
  • స్పందించని ఇన్‌స్టాగ్రామ్‌ యాజమాన్యం

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌ ఈరోజు క్రాష్ అయింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు స్తంభించిపోయాయి. దీంతో పలువురు యూజర్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. కేవలం మొబైల్ మాత్రమే కాకుండా డెస్క్ టాప్ వెర్షన్ కూడా పనిచేయకుండా ఆగిపోయింది. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌ పై చాలామంది యూజర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌ లో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించగా ‘సర్వర్ ఎర్రర్’ అంటూ సందేశం కనిపించింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లు జోకులు పేల్చుతున్నారు.

ఫొటో, వీడియో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌ను 2010, అక్టోబర్ లో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ యాప్ 36 భాషల్లో లభ్యమవుతోంది. దాదాపు రూ.7,328 కోట్ల(బిలియన్ డాలర్ల)తో ఈ యాప్ ను సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ 2012లో కొనుగోలు చేసింది. కాగా, తాజా క్రాష్ పై ఇన్ స్టాగ్రామ్ యాజమాన్యం స్పందించలేదు.

  • Loading...

More Telugu News