sensex: రూపాయి దెబ్బకు కుప్పకూలిన మార్కెట్లు
- డాలరుతో పోల్చితే దారుణంగా పతనమవుతున్న రూపాయి విలువ
- 550 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- 11 వేల కిందకు పడిపోయిన నిఫ్టీ
నానాటికీ బలహీనపడుతున్న రూపాయి విలువ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న క్రూడాయిల్ ధరలు కూడా మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. సెన్సెక్స్ 550 పాయింట్లు పతనమై 35,975కి పడిపోయింది. నిఫ్టీ 150 పాయింట్లు కోల్పోయి 10,858కి జారుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్ పోర్టేషన్ నెట్ వర్క్స్ (19.29%), ఇన్ఫీబీమ్ అవెన్యూస్ (14.82%), కాక్స్ అండ్ కింగ్స్ (12.30%), నేషనల్ అల్యూమినియం కంపెనీ (11.52%), ఇండియాబుల్స్ (9.99%).
టాప్ లూజర్స్:
ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్ (-6.98%), ఐషర్ మోటార్స్ (-6.71%), మహీంద్రా అండ్ మహీంద్రా (-6.66%), ముత్తూట్ ఫైనాన్స్ (-5.77%), బాటా ఇండియా (-5.77%).