kcr: ఎన్నికల కోడ్ ఎత్తేసిన మర్నాడే ఆడపడచులకు బతుకమ్మ చీరలు : కేసీఆర్
- భువనగిరికి చెందిన వ్యక్తి ఈసీకి ఫిర్యాదు చేశాడు
- తెలంగాణ ఆడపడుచులు బాధపడొద్దు
- దసరాలోపు కాకపోయినా కోడ్ ఎత్తేసిన తర్వాత పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేసేందుకు వీలులేదని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో నల్గొండ సభలో సీఎం కేసీఆర్ స్పందిస్తూ, ఈ విషయమై భువనగిరికి చెందిన గూడూరు నారాయణరెడ్డి అనే వ్యక్తి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశాడని అన్నారు. తెలంగాణ ఆడపడుచులు ఏం బాధపడొద్దని.. దసరా లోపు ఈ చీరలు పంచలేకపోయినా, ఎన్నికల కోడ్ ఎత్తేసిన మర్నాడే ఆ చీరలను ఆడపడచుల చేతిలో పెడతామని చెప్పారు.