Ayodhya: అయోధ్య రామమందిర నిర్మాణం విషయంలో వీహెచ్‌పీ సంచలన తీర్మానం!

  • రామాలయ నిర్మాణానికి చట్టం తీసుకురావాలి
  • రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి
  • జనవరి 31 వరకు వేచి చూడాలని వీహెచ్‌పీ నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చి మరీ అయోధ్యలో రామమందిరం నిర్మించాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రత్యేక తీర్మానం చేసింది. కోర్టు కేసుల పేరిట కాలయాపన చేయకుండా త్వరితగతిన బిల్లును తీసుకొచ్చి రామాలయం నిర్మించాలని వీహెచ్‌పీ ఉచ్ఛాధికార సమితి తీర్మానించింది. ఈ విషయాన్ని వీహెచ్‌పీ ప్రతినిధి మహంత్ నృత్య గోపాల్ తెలిపారు.

రామాలయం నిర్మాణానికి పార్లమెంటు చట్టం తీసుకొచ్చేలా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జోక్యం చేసుకోవాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వనున్నట్టు తెలిపారు. జనవరి 31 వరకు ఈ విషయంలో వేచి చూస్తామని, ఆ తర్వాత కూడా చట్టం తీసుకురాకుంటే భవిష్యత్ కార్యాచరణను ప్రారంభిస్తామని గోపాల్ దాస్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News