krishnachaitanya: ఆస్తులు అమ్మేసి 'ఘంటసాల' సినిమా తీశాము: నిర్మాతలు

  • తెరపైకి 'ఘంటసాల' జీవితచరిత్ర 
  • ఈ నెల 13వ తేదీన విడుదల 
  • మద్దతు ఇవ్వాలంటూ నిర్మాతల విన్నపం   

తెలుగులో సావిత్రి జీవితచరిత్రగా 'మహానటి' తెరకెక్కి అనూహ్యమైన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో ఒక వైపున 'ఎన్టీఆర్' బయోపిక్ నిర్మితమవుతూ ఉంటే, మరో వైపున కాంతారావు బయోపిక్ ను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమరగాయకుడు ఘంటసాల జీవితచరిత్ర కూడా తెరపైకి రానుంది. ఘంటసాల దంపతులుగా గాయకుడు కృష్ణచైతన్య .. ఆయన భార్య మృదుల నటించారు.

సిహెచ్. రామారావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 13వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే తమ అనుమతి తీసుకోకుండా 'ఘంటసాల'గారి జీవితచరిత్రను రూపొందించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఘంటసాల తనయుడు రత్నకుమార్ పత్రికాముఖంగా తెలియజేశారు. దాంతో 'ఘంటసాల' సినిమా టీమ్ .. తెలుగు ఫిల్మ్ చాంబర్లో మీడియా ముందుకు వచ్చింది. ఘంటసాలగారి పట్ల అభిమానంతోనే ఈ సినిమా తీశామనీ .. అందుకోసం ఆస్తులు అమ్మేశామని నిర్మాతలు చెప్పారు. ఘంటసాల కుటుంబ సభ్యులు తమకి మద్దతునిస్తూ .. ప్రచారం పరంగా సహకరించాలని కోరారు. మరి ఘంటసాల రత్నకుమార్ ఎలా స్పందిస్తాడో చూడాలి. 

  • Loading...

More Telugu News