warangal: అరవయ్యో వసంతంలోకి వరంగల్‌ ఎన్ఐటీ.. నేడు వజ్రోత్సవ వేడుకలు!

  • హాజరు కానున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
  • అంబేడ్కర్‌ లెర్నింగ్‌ సెంటర్‌లో వేడుకలకు శ్రీకారం
  • పూర్వ విద్యార్థుల సాయంతో నిర్మించనున్న భవనానికి శంకుస్థాపన

వరంగల్‌లోని జాతీయ సాంకేతిక విద్యాలయం (నిట్‌) వజ్రోత్సవ వేడుకలకు ముస్తాబయింది. ఈ ప్రతిష్టాత్మక విద్యాలయం ఏర్పడి 59 ఏళ్లు పూర్తయ్యాయి.  ఈ సందర్భంగా అంబ్కేడ్కర్‌ లెర్నింగ్‌ సెంటర్‌లో ఘనంగా వేడుకల నిర్వాహణకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 9.30 గంటలకు వేడుకలు ప్రారంభంకానున్నాయి. విద్యా సంస్థ అరవయ్యో వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలకు భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

ఈ సందర్భంగా నిట్‌ పూర్వ విద్యార్థులు సమకూర్చిన రూ.25 కోట్ల నిధులతో నిర్మించనున్న అలుమిని కన్వెన్షన్‌ సెంటర్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అంబేడ్కర్‌ లెర్నింగ్‌ సెంటర్‌లో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. ఆర్‌ఈసీ, నిట్‌లో పనిచేసిన ప్రిన్సిపాళ్లు, డైరెక్టర్లను ఘనంగా సత్కరిస్తారు. విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తారు. ఉప రాష్ట్రపతి రాక సందర్భంగా సంస్థలో జెడ్‌ కేటగిరీ భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రతా కారణాల రీత్యా పాసులున్న వారినే సభామందిరంలోకి అనుమతించనున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు. అయితే ఉప రాష్ట్రపతితో పాటు మిగిలిన ముఖ్య అతిథుల ప్రసంగాలు విద్యార్థులు, నిట్‌ ఉద్యోగులు, ఇతర అధికారులు వినేందుకు వీలుగా హాల్‌ బయట భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

  • Loading...

More Telugu News