Vanajeevi ramayya: పర్యావరణ ప్రేమికుడు వనజీవి రామయ్యకు తీవ్ర అస్వస్థత
- కేర్ ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
- రామయ్య సతీమణి జానకమ్మకు కూడా జ్వరం
- ఒకే ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు
కోటి మొక్కలు నాటి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న సామాజిక కార్యకర్త, పర్యావరణ ప్రేమికుడు వనజీవి రామయ్య జ్వరంతో బాధపడుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన కేర్ ఆస్పత్రికి తరలించారు. రామయ్య సతీమణి జానకమ్మ కూడా జ్వరం బారిన పడడంతో నాలుగు రోజుల క్రితం ఇదే కేర్ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం దంపతులిద్దరికీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఖమ్మం రూరల్ మండం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దారిపల్లి రామయ్యకు మొక్కలంటే ప్రాణం. భూమి పచ్చదనంతో అలరారాలని కోరుకుంటూ మొక్కలు నాటడాన్ని ఓ ఉద్యమంలా చేపట్టారు. దాదాపు కోటి మొక్కలు నాటించారు. అందుకే ఈయనను స్థానికులు చెట్ల రామయ్య, వనజీవి రామయ్య అని పిలుస్తుంటారు. ఈయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2017లో పద్మశ్రీ పురస్కారాన్నిఅందించి సత్కరించింది. 1937లో పుట్టిన రామయ్య వయసు ప్రస్తుతం 81 ఏళ్లు.