Gold: నేడూ తగ్గిన బంగారం ధర
- రూ.220 తగ్గిన బంగారం
- రూ.31,650కు చేరుకున్న 10గ్రాముల పసిడి ధర
- రూ.50 తగ్గిన వెండి
పసిడి ధర రోజురోజుకూ తగ్గుతోంది. నేడు(మంగళవారం) రూ.220 తగ్గడంతో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.31,650కు చేరుకుంది. పుత్తడి బాటలోనే వెండి కూడా పయనించింది. రూ.50 తగ్గడంతో కిలో వెండి ధర రూ.39,250కి చేరింది. పసిడి తగ్గుదలకు రూపాయి పతనం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు కారణమైతే... పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల దగ్గర నుంచి ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు లేకపోవడంతో వెండి ధర తగ్గినట్లు ట్రేడర్లు చెబుతున్నారు.
ఇక అంతర్జాతీయ మార్కెట్లలోను బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి. న్యూయార్క్ మార్కెట్లో బంగారం ధర 1.39 శాతం తగ్గి ఔన్సు 1,187 డాలర్లు పలికింది. వెండి కూడా 2.39 శాతం తగ్గి ఔన్సు 14.38 డాలర్లు పలికింది. స్థానిక ఆభరణాల తయారీదారుల దగ్గర నుంచి కొనుగోళ్లు మందగించడం కూడా పసిడి ధర పడిపోవడంపై ప్రభావం చూపినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.