paruchuri: ఏ నేరస్థుడైనా 'నేను దొరకను' అనే భ్రమలో ఉంటాడు: పరుచూరి గోపాలకృష్ణ

  • ఇష్టం లేకపోతే చట్టప్రకారం విడిపోవచ్చు
  • తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు
  • హత్యలు చేయించడం కరెక్ట్ కాదు  

ఈ వారం 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో, భార్య .. భర్తను చంపించడం, భర్త .. భార్యను చంపించడం అనే విషయంపై పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. భార్యాభర్తలలో ఒకరికి ఒకరంటే ఇష్టం లేకపోతే కారణం చూపించి విడాకులు తీసుకుని వెళ్లిపోయే అవకాశం వుంది. తొందరపాటు నిర్ణయాల కారణంగా హత్యలు చేసి అందరూ జైలుపాలవుతున్నారు.

ఏ నేరస్థుడికైనా 'నేను దొరకను' అనే ఒక పిచ్చి భ్రమ ఉంటుంది. నేను ఎక్కడో చదివా .. పోలీస్ కంటే క్రిమినల్ కి ఎక్కువ తెలివితేటలు ఉంటాయని. మరి అలాంటప్పుడు ఎక్కువ తెలివితేటలు వున్న క్రిమినల్ .. పోలీస్ కి ఎందుకు దొరికిపోతున్నాడు? పోలీస్ చట్టం కోసం .. ధర్మం కోసం పోరాడతాడు కాబట్టి ఆయనకి భయం వుండదు. క్రిమినల్ చట్టవ్యతిరేకమైన పని చేశాడు కాబట్టి అనుక్షణం భయపడుతూ .. ఆ భయంతో ఎక్కడో తప్పటడుగు వేసి దొరికిపోతాడు" అని చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News