prattipati: కష్టపడే నాయకుడి కాళ్లు లాగేయాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి: మంత్రి ప్రత్తిపాటి

  • ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి
  • ఏం తప్పు చేశారని వారి పాస్ పోర్ట్ లు సీజ్ చేస్తారు?
  • కోర్టు బోను ఎక్కే వీళ్లా మాట్లాడేది? 

ఏపీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం చంద్రబాబునాయుడుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలు, ఆరోపణలను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్ ల పాస్ పోర్ట్ లు సీజ్ చేయాలన్న వ్యాఖ్యలను ఖండించారు. గుంటూరులో ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, కష్టపడే నాయకుడి కాళ్లు లాగేయాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని, ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు.

చంద్రబాబు, లోకేశ్ ఏం తప్పు చేశారని పాస్ పోర్ట్ లు సీజ్ చేస్తారు? అని ప్రశ్నించారు. కోర్టు అనుమతి పొంది పక్కదేశాలకు వెళ్లేవారు చంద్రబాబు గురించి మాట్లాడటం హాస్యాస్పదమని, అవినీతికి పాల్పడి కోర్టు బోను ఎక్కే వీళ్లా మాట్లాడేది? అని అన్నారు. ఏపీలో అభివృద్ధి జరుగుతుంటే అవినీతి ముద్ర వేస్తున్నారని, సీఎం చేసిన అభివృద్ధి కళ్లకు కట్టినట్టు కనబడుతోందని, ప్రతిపక్షాలకు 2019 ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. బీజేపీతో లాలూచీ పడిన వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి ఏం సాధించారని ప్రశ్నించారు.  

  • Loading...

More Telugu News