Amith shah: మోదీ నాయకత్వాన్ని ఎదుర్కొనే ధైర్యంలేకే కేసీఆర్ ముందస్తుకు వెళ్లారు: అమిత్ షా
- ఎన్నికలు 2019 ఏప్రిల్, మేలో జరగాలి
- ముందస్తు కారణంగా వందల కోట్ల భారం
- బీద, బడుగు వర్గాలపై అదనపు భారం
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఎదుర్కొనే ధైర్యంలేకనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు. కరీంనగర్లో జరిగిన బీజేపీ తొలి ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు.
‘‘2018లో తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు.. వాస్తవానికి 2019 ఏప్రిల్, మేలో జరగాల్సి ఉంది. దేశంలో జరిగే లోక్సభ ఎన్నికలతో పాటు జరగాల్సిన ఎన్నికలను 6 నెలల ముందుకు తీసుకొచ్చి ఎన్నికలు జరిపించడంలో ఆంతర్యమేంటి? అని ప్రశ్నిస్తున్నా. ఈ ఎన్నికలు ముందు జరగడం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలపై అదనపు భారం వందల కోట్లు పడుతోంది.
ఈ ప్రాంతంలో ఉండే బీద, బడుగు వర్గాల ప్రజలు అదనపు భారం మోసే ఈ ఎన్నికను ముందే ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందని నేను ప్రశ్నిస్తున్నా. దీనికి కారణం 2019లో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్నికలను ఎదుర్కొంటే ఇబ్బందుల్లో పడతానని భయపడి కేసీఆర్ ముందస్తుకు వెళ్లడం జరిగింది’’ అని అమిత్ షా విమర్శించారు.