n k singh: ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వకుండా తప్పించుకునేందుకే 14వ ఆర్థిక సంఘాన్ని సాకుగా చూపారు: ఆర్థిక సంఘం ఛైర్మన్
- విభజన చట్టాల అమలుకు గతంలో ప్రత్యేకమైన వ్యవస్థ ఉండేది
- అప్పట్లో ప్లానింగ్ కమిషన్ ఛైర్మన్ బాధ్యత తీసుకునేవారు
- హోదా అంశం 15వ ఆర్థిక సంఘం పరిధిలోకి రాదు
15వ ఆర్థిక సంఘం ఈరోజు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్కే సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో రాష్ట్రాలు విడిపోయినప్పుడు విభజన చట్టాల అమలుకు ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉండేదని... ఇప్పుడు అలాంటి వ్యవస్థ లేదని చెప్పారు. వీటికి సంబంధించి అప్పట్లో ప్లానింగ్ కమిషన్ ఛైర్మన్ బాధ్యత తీసుకునేవారని తెలిపారు.
ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వకుండా తప్పించేందుకు 14వ ఆర్థిక సంఘాన్ని సాకుగా చూపారని అన్నారు. ఏపీ పునర్విభజన చట్టం అమలుకు పర్యవేక్షణ వ్యవస్థ లేదని చెప్పారు. ప్రత్యేక హోదా అంశం 15వ ఆర్థిక సంఘం పరిధిలోకి రాదని తెలిపారు. రెవెన్యూ లోటు భర్తీపై ఏపీ ప్రతిపాదనను పరిశీలిస్తామని చెప్పారు. ఏపీ విభజన బిల్లు పార్లమెంటులో పాస్ అయినప్పుడు తాను కూడా రాజ్యసభలో ఉన్నానని తెలిపారు.