Tanjania: టాంజానియాలో భారత సంతతి బిలియనీర్ కిడ్నాప్!
- దార్ ఏ సలామ్ లో ఘటన
- లగ్జరీ హోటల్ లోకి ప్రవేశించిన సాయుధులు
- గాల్లోకి కాల్పులు జరిపి మహమ్మద్ డ్యూజీ కిడ్నాప్
టాంజానియాకు చెందిన భారతీయ సంతతి కోటీశ్వరుడు మహమ్మద్ డ్యూజీని కొందరు సాయుధులు ఓ లగ్జరీ హోటల్ నుంచి కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపింది. దార్ ఏ సలామ్ లోని ఓ హోటల్ లో జిమ్ కు వెళుతున్న ఆయన్ను, తుపాకులతో వచ్చిన సాయుధులు కిడ్నాప్ చేసినట్టు 'సీఎన్ఎన్' వార్తా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది.
డ్యూజీని కిడ్నాప్ చేసే ముందు వారు గాల్లోకి కాల్పులు జరిపారని స్థానిక పోలీస్ కమిషనర్ మాంబోసాసో వెల్లడించారు. తాము వివరాలు సేకరిస్తున్నామని, ఘటన జరిగిన సమయంలో హోటల్ లో ఉన్న వారిని ప్రశ్నిస్తున్నామని తెలిపారు. కిడ్నాప్ చేసినవారు టాంజానియన్లు కాదని, వారు విదేశీయులని గుర్తించామని, జిమ్ లోకి వెళ్లిన వారు ఈ ఘటనకు పాల్పడ్డారని చెప్పారు.
కాగా, మహమ్మద్ డ్యూజీని కిడ్నాప్ చేయడానికి కారణం ఏంటన్న విషయం ఇంకా తెలియరాదేదు. పలు రకాల వ్యాపారాలు చేస్తున్న మహమ్మద్ డ్యూజీ, టాంజానియన్ లో యువ బిలియనీర్ గా గుర్తింపు పొందాడు.