Kamal Haasan: నిజాయతీగా కొనసాగితే ‘మీ టూ’ ఉద్యమాన్ని స్వాగతిస్తా: కమలహాసన్

  • బాధితురాలే ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడాలి
  • మూడో వ్యక్తి కామెంట్ చేయకూడదు
  • ఇలాంటి వేధింపులు ‘కణ్ణగి’ రోజుల నుంచే చూస్తున్నాం

నిజాయతీగా కొనసాగితే ‘మీ టూ’ ఉద్యమాన్ని స్వాగతిస్తానని ప్రముఖ నటుడు కమలహాసన్ పేర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, లైంగిక వేధింపుల విషయాల్లో బాధితురాలే ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడాలి తప్ప, దీంతో సంబంధం లేని మూడో వ్యక్తి దానిపై కామెంట్ చేయకూడదని అభిప్రాయపడ్డారు.

సమాజంలో మహిళలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ప్రజలు కూడా తెలుసుకోవాలని సూచించిన కమల్, దక్షిణ భారతదేశ కావ్యమైన ‘శిలప్పాధికారం’లో కణ్ణగి పాత్ర గురించి ఆయన ప్రస్తావించారు. ఇలాంటి వేధింపులను కణ్ణగి రోజుల నుంచే చూస్తున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News