Gaddar: ప్రజలు కోరితే కేసీఆర్‌పై పోటీకి సిద్ధం: గద్దర్

  • సోనియా, రాహుల్‌ను కలిసిన గద్దర్
  • కేంద్రంలో బూర్జువా పాలన సాగుతోంది
  • నయా ఫ్యూడలిజం వచ్చేసింది

రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ప్రజా గాయకుడు గద్దర్ కోరారు. కాంగ్రెస్‌ నేతలు మధుయాష్కి, కొప్పుల రాజుతో కలిసి గద్దర్‌ తన భార్య, కుమారుడితో ఢిల్లీలో సోనియా, రాహుల్‌‌లను గద్దర్ కలిశారు. తన ఉద్యమ కార్యాచరణను సోనియాకు వివరించారు.

కేంద్రంలో బూర్జువా వ్యవస్థ పాలన సాగుతోందని.. అది పోయేందుకే రాహుల్‌ గాంధీ తీసుకున్న ‘రాజ్యాంగాన్ని కాపాడి, దేశాన్ని కాపాడండి’ ఉద్యమానికి మద్దతు పలికినట్టు ప్రజా గాయకుడు గద్దర్‌ తెలిపారు. తెలంగాణలోనూ రాజ్యాంగ రక్షణ అవసరమని, రాష్ట్రంలో నయా ఫ్యూడలిజం వచ్చేసిందని గద్దర్‌ అభిప్రాయపడ్డారు. ఏ పార్టీలోనూ చేరనని స్పష్టం చేసిన గద్దర్‌.. పార్టీలూ, ప్రజలు కోరితే కేసీఆర్‌పై పోటీచేసేందుకు సిద్ధమన్నారు.

  • Loading...

More Telugu News