paruchuri: 'ఠాగూర్' పాత్రలో ఉండగా చిరూతో కామెడీ చేయించలేదు: పరుచూరి గోపాలకృష్ణ
- 'ఠాగూర్'లో హాస్పిటల్ సీన్ గుర్తుండే ఉంటుంది
- చాలామంది డాక్టర్లు ఫోన్ చేశారు
- నవ్వుతూనే మాతో అలా అన్నారు
తమిళంలో 'రమణ' సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఆ సినిమాను తెలుగులో 'ఠాగూర్'గా రీమేక్ చేశారు. చిరంజీవి కథానాయకుడిగా చేసిన ఆ సినిమాను గురించి, తాజాగా 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. "ఈ సినిమాను బాగా పరిశీలిస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది. 'ఠాగూర్' పాత్రలో ఉండగా చిరంజీవితో ఎక్కడా కూడా కామెడీ చేయించలేదు.
"కొన్ని సందర్భాల్లో ఆయన పక్కన సునీల్ ను ఉంచి .. మరి కొన్ని సందర్భాల్లో శ్రియను ఉంచి కామెడీని చేయించుకొచ్చాం. తెలుగులో నర్సింగ్ యాదవ్ తో కూడా కామెడీని పండించాం .. ఒరిజినల్ లో ఆ పాత్ర నిజంగా రౌడీ మాదిరిగానే ఉంటుంది. ఇలా ఈ సినిమాలో రఫ్ గా హీరో ఉండటం గ్రామర్ .. రఫ్ గా వుండే హీరో పాత్ర పక్కనే మరో పాత్రతో ఎంటర్టైన్మెంట్ ను నడిపించడం గ్లామర్. హాస్పిటల్లో చనిపోయిన వ్యక్తికి డాక్టర్లు వైద్యం చేయడం చూపించాం. దాంతో తెలిసిన డాక్టర్లు చాలామంది మాకు ఫోన్ చేసి, 'మీరు రాకపోతారా హాస్పిటల్ కి .. అప్పుడు చూస్తాం' అని సరదాగా అనేవారు" అంటూ నవ్వేశారు.