Bangladesh: ఇది ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ లాంటిది.. గెలవబోయేది కాంగ్రెస్సే: బండ్ల గణేష్
- ఎవరికివాళ్లు విజయం సాధించాలనుకుంటారు
- ఈ ధర్మపోరాటంలో గెలిచేది కాంగ్రెస్సే
- మేము అధికారంలోకొస్తే కక్ష సాధింపు చర్యలుండవు
తెలంగాణలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ఆ పార్టీ నాయకుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ధీమా వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికలు ధర్మపోరాటంతో సమానమని, ఆ పోరాటంలో ఎవరికివాళ్లు విజయం సాధించాలని కోరుకుంటారని అన్నారు. ఇది ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ లాంటిదని, ఈ ధర్మ పోరాటంలో గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొస్తే ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు, ఇబ్బందిపెట్టడం వంటివి ఉండవని స్పష్టం చేశారు.
అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, రేపు తమ పార్టీ అధికారంలోకొస్తే తాము కూడా ఊరుకోమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే అరుణ చేసిన వ్యాఖ్యలకు అర్థమేంటని ప్రశ్నించగా.. ‘అరుణక్క ఏదో ఆవేశంతో అంది గానీ..’ అంటూ దాటవేశారు. బీజేపీతో కలిసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఐటీ దాడులు చేయిస్తోందా? అని ప్రశ్నంచగా.. ‘దాని గురించి నేనేమీ కామెంట్ చేయను’ అని గణేష్ సమాధానమిచ్చారు.