sensex: బ్యాంకింగ్, ఆటో స్టాకులు ఒత్తిడికి గురైనా.. లాభాలతో వారాన్ని ప్రారంభించిన మార్కెట్లు
- ఐటీ, ఫార్మా తదితర స్టాకుల్లో కొనుగోళ్ల జోరు
- 132 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 40 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. బ్యాంకింగ్, ఆటో స్టాకులు ఒత్తిడికి గురైనప్పటికీ... ఐటీ, ఫార్మా తదితర కౌంటర్లలో కొనుగోళ్ల జోరు కనిపించింది. దీంతో, ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 132 పాయింట్లు లాభపడి 34,865కి పెరిగింది. నిఫ్టీ 40 పాయింట్లు పెరిగి 10,512కు చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ట్రైడెంట్ లిమిటెడ్ (19.76), వెంకీస్ ఇండియా (13.27), టీవీ18 బ్రాడ్ కాస్ట్ (13.25), గుజరాత్ గ్యాస్ (12.27), డీసీఎం శ్రీరామ్ (11.53).
టాప్ లూజర్స్:
రాజేష్ ఎక్స్ పోర్ట్స్ (6.73), అవెన్యూ అపార్ట్ మెంట్స్ (5.50), జ్యోతి లేబొరేటరీస్ (5.42), క్వాలిటీ (4.99), ఎస్ఆర్ఈఐ ఇన్ఫ్రా (4.87).