srilekha: నిజమే .. అప్పట్లో పోసానితో గొడవైంది: శ్రీలేఖ
- 'ఆపరేషన్ దుర్యోధన'కి పనిచేశాను
- పాటలన్నీ కూడా చాలా బాగా వచ్చాయి
- రీ రికార్డింగ్ ఒకచోట పోసానికి నచ్చలేదు
రామానాయుడు నిర్మించిన 'తాజ్ మహల్' సినిమాతో సంగీత దర్శకురాలిగా శ్రీలేఖకి మంచిపేరు వచ్చింది. ఆ తరువాత 'శివయ్య' .. 'ప్రేయసి రావే' .. 'ప్రేమించు' .. 'అదిరిందయ్యా చంద్రం' .. 'ఆపరేషన్ దుర్యోధన' .. 'మూడు ముక్కలాట'వంటి చిత్రాలు ఆమె క్రేజ్ ను మరింత పెంచాయి. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ .. 'ఆపరేషన్ దుర్యోధన' సినిమా సమయంలో పోసాని కృష్ణమురళితో జరిగిన గొడవను గురించి ప్రస్తావించారు.
'ఆపరేషన్ దుర్యోధన' సినిమా చివరి వరకూ ఆయనతో చర్చలు సాఫీగా జరుగుతూ వచ్చాయి. సాంగ్స్ విషయంలో ఎలాంటి సమస్య లేదు. రీ రికార్డింగ్ సమయంలోనే గొడవైంది. ఒకచోట వైలెన్స్ కావాలని అంటారు ఆయన .. పెట్టాను అని అంటాను నేను. ఆ సమయంలోనే నువ్వెంత అంటే నువ్వెంత అంటూ మాటా మాటా పెరుగుతూ పోయింది. ఆయన కుర్చీలో నుంచి విసురుగా లేచి వెళ్లిపోయారు .. నేను కూడా లేచి వెళ్లిపోయాను. ఆ కాసేపే అదంతా .. ఆ తరువాత ఇద్దరం కలిసి మళ్లీ పనిచేశాం" అంటూ చెప్పుకొచ్చారు.