kcr: రైతులకు లక్ష వరకు రుణమాఫీ.. నిరుద్యోగ భృతి రూ.3,016 అందజేస్తాం: సీఎం కేసీఆర్
- రాష్ట్రంలో రైతే రాజు కావాలి
- ‘రైతుబంధు’లో ఎకరాకు రూ.వెయ్యి పెంచుతాం
- రాబోయే రెండేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయి
రాష్ట్రంలో రైతే రాజు కావాలని, మళ్లీ అధికారంలో కొస్తే రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సమావేశం ముగిసింది. అనంతరం, మీడియాతో కేసీఆర్ మాట్లాడుతూ, ప్రస్తుతం రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రెండు విడతలుగా రూ.4 వేలు చొప్పున ఇస్తున్నామని, దీన్ని రూ.5 వేలకు పెంచుతామని ప్రకటించారు.
రాబోయే రెండేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని తద్వారా తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ‘నిరుద్యోగ భృతి’ గురించి ప్రస్తావించిన కేసీఆర్, ఇది చాలా కఠిన సమస్య అని అన్నారు. నిరుద్యోగ భృతి కింద రూ.3,016 అందజేస్తామని హామీ ఇచ్చారు.