CM Ramesh: జీవీఎల్ మాట్లాడేవన్నీ అబద్ధాలే.. నేనలా మాట్లాడలేను: సీఎం రమేష్
- కాంట్రాక్టు పనుల్లో అవినీతి కనిపించలేదా?
- నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టు ఇవ్వలేదు
- ఇచ్చారని నిరూపిస్తే దేనికైనా సిద్ధం
రాజ్యసభ సభ్యుడు, టీడీపీ సీనియర్ నేత సీఎం రమేష్ ఇంటిపై ఐటీ దాడులు కలకలం రేపాయి. కడప, హైదరాబాద్లోని ఆయన నివాసాలు, వ్యాపార సంస్థలపై ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ విషయమై ఓ టీవీ ఛానల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో సీఎం రమేష్ మాట్లాడుతూ తన సంస్థకు నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టు ఇవ్వలేదని.. ఒకవేళ ఇచ్చారని నిరూపించగలిగితే తాను దేనికైనా సిద్ధమన్నారు.
తాము కేంద్రంలో రూ.6 వేల కోట్లకు సంబంధించిన పనులు నిర్వహించామని, మరి వాటిల్లో అవినీతి కనిపించలేదా? అని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మట్లాడేవన్నీ అబద్ధాలేనన్నారు. తాను జీవీఎల్లా బరితెగించి మాట్లాడలేనని సీఎం రమేష్ స్పష్టం చేశారు.