world economic forum: వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి కేటీఆర్ కు ఆహ్వానం
- జనవరి 22 నుంచి 25 వరకు దావోస్ లో సదస్సు
- కేసీఆర్ ను ఆహ్వానించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు
- హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్
తెలంగాణ మంత్రి కేటీఆర్ కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి మరోసారి ఆహ్వానం అందింది. జనవరి 22 నుంచి 25 వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగే సమావేశానికి అతిథిగా హాజరు కావాలని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆహ్వానించింది.
ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి సుమారు మూడు వేల మంది పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వాల ప్రతినిధులు, మరికొందరు విశిష్ట వ్యక్తులు హాజరుకానున్నారు. గత ఏడాది కూడా కేటీఆర్ ఈ సమావేశానికి హాజరైన సంగతి తెలిసిందే. పాలనలో పారదర్శకత, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఉద్యోగాల కల్పన, డిజిటలైజేషన్, అర్బన్ డెవలప్ మెంట్ తదితర అంశాలపై సదస్సులో మాట్లాడాలని కేటీఆర్ కు పంపిన ఆహ్వాన పత్రికలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు కోరారు. మరోవైపు, తనకు ఆహ్వానం పంపడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.