cbi: సీబీఐలో కుమ్ములాటను సరిదిద్దేందుకు రంగంలోకి దిగిన మోదీ.. ఇద్దరు అధికారులకు సమన్లు!

  • మనీలాండరింగ్ కేసు మాఫీ కోసం లంచం
  • సీబీఐ డైరెక్టర్ పై రెండు నెలల కింద ఫిర్యాదు చేసిన స్పెషల్ డైరెక్టర్
  • స్పెషల్ డైరెక్టర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
  • ఇద్దరికీ సమన్లు జారీ చేసిన మోదీ

దేశంలోని అవినీతిపరులకు చుక్కలు చూపించే సీబీఐపైనే ఇప్పుడు అవినీతి మరక పడింది. రూ. కోట్ల లంచానికి సంబధించి సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాల మధ్య నడుస్తున్న వివాదం ప్రకంపనలు పుట్టిస్తోంది. రాకేష్ ఆస్థానా ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడు కావడంతో... ఈ అంశం కాస్తా రాజకీయరంగు పులుముకుంది. దీంతో, స్వయంగా మోదీ రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఇద్దరూ తన వద్దకు రావాల్సిందిగా ఆయన సమన్లు జారీ చేశారు. తనను కలిసి వివరణ ఇవ్వాలంటూ మోదీ ఆదేశించారు.

వివరాల్లోకి వెళ్తే, మాంసం ఎగుమతి వ్యాపారం చేసే మొయిన్ ఖురేషీపై మనీలాండరింగ్ కేసు మాఫీ కోసం రాకేష్ ఆస్థానా రూ. కోట్ల లంచం తీసుకున్నారంటూ సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇదే కేసు విషయంలో లోక్ వర్మ లంచం తీసుకున్నారంటూ కేంద్ర కేబినెట్ కార్యదర్శికి ఆస్థానా రెండు నెలల క్రితం లేఖ రాశారు. అయితే, రివర్స్ లో ఇప్పుడు ఆస్థానాపైనే సీబీఐ కేసు నమోదైంది. 

  • Loading...

More Telugu News