cbi: అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై యనమల విమర్శలు
- సీబీఐ డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ పరస్పర ఆరోపణలా?
- గతంలో ఎప్పుడైనా చూశామా?
- మోదీ అసమర్ధపాలనకు ఇదే నిదర్శనం
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లో ముడుపుల వ్యవహారంపై నిష్పాక్షిక విచారణ జరుపుతామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీబీఐ డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ పరస్పర ఆరోపణలు చేసుకోవడం గతంలో ఎప్పుడైనా చూశామా? అని ప్రశ్నించారు.
ప్రధాని మోదీ అసమర్ధపాలనకు ఈ ఉదంతమే నిదర్శనమని, సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి సంస్థల ప్రతిష్టను దిగజారుస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా రాఫెల్ కుంభకోణం, గతంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కన్నీరు పెట్టిన అంశాలను యనమల ప్రస్తావించారు. ఈడీ జప్తు చేసిన వైఎస్ జగన్ ఆస్తులను వెనక్కి తీసుకోవడం ద్వారా నిష్పాక్షికత ఏపాటిదో అర్థమైందంటూ యనమల వ్యంగ్యాస్త్రాలు సంధించారు.