London: అన్నం ప్యాకెట్‌లో ఎలుక ఉందని ట్వీట్.. దుమారం!

  • అన్నం ప్యాకెట్‌లో కనిపించిన ఎలుక పిల్ల
  • ట్విటర్ ద్వారా సంస్థను నిలదీసిన రిచర్డ్
  • బూజుగా తేల్చిన ‘గోల్డెన్ సన్’ సిబ్బంది

లండన్‌కు చెందిన రిచర్డ్ లీచ్ అనే వినియోగదారుడు రైస్ ప్యాకెట్ కొనుక్కుని ఇంటికి వెళ్లి తినేందుకు అన్నాన్ని పళ్లెంలో వేసుకున్నాడు. అయితే, అందులో ఒక ఎలుక పిల్ల కనిపించింది. వెంటనే సదరు సంస్థకు ట్వీట్ చేశాడు. ఇది కాస్తా నెట్టింట్లో బాగా వైరల్ అయింది. సదరు సంస్థపై విపరీతంగా ట్రోల్స్ జరిగాయి. తీరా ఆ సంస్థ తమ సిబ్బందిని రిచర్డ్ ఇంటికి పంపగా అది ఎలుక పిల్ల కాదని.. నిల్వ ఉండటం వల్ల బూజు పట్టిందని నిర్థారించారు.

ఎల్‌ఐడీఎల్‌ ‘గోల్డెన్‌ సన్’ బ్రాండ్‌ సంస్థ తయారు చేసి విక్రయించే అన్నం‌ ప్యాకెట్‌ను రిచర్డ్ ఓ సూపర్ మార్కెట్‌లో కొనుగోలు చేశారు. ఇంటికి వెళ్లి అన్నాన్ని పళ్లెంలో వేసుకుంటే ఎలుకలా కనిపించింది. వెంటనే ట్విట్టర్‌లో ‘నేను కొన్న అన్నం ప్యాకెట్‌లోకి ఎలుక ఎలా వచ్చిందో చెప్తారా? దాని కారణంగా మా ఇల్లంతా దుర్వాసనతో నిండిపోయింది. నా భార్య వాంతులు చేసుకుంటోంది’ అని ట్వీట్ చేశాడు. ఇది నెట్టింట్లో బాగా వైరల్ అయింది. ట్రోల్స్ కూడా బాగా పెరిగిపోయాయి.

వెంటనే సదరు సంస్థ క్షమాపణలు చెప్పింది. దీనిపై పూర్తి విచారణ జరుపుతామని సదరు సంస్థ మీడియాకు తెలిపింది. వెంటనే తమ సిబ్బందిని రిచర్డ్ ఇంటికి పంపించింది. అయితే, అన్నంలో ఉన్నది ఎలుక పిల్ల కాదని.. నిల్వ ఉండటం కారణంగా పట్టిన బూజుగా సిబ్బంది గుర్తించారు. అది అన్నానికి అతుక్కోవడంతో ఎలుక పిల్లలా కనిపించిందట. అయినా బూజు పట్టిన రైస్ ప్యాకెట్‌ను విక్రయించినందుకు ఆ సంస్థపై విమర్శలు మాత్రం ఆగట్లేదు.

  • Loading...

More Telugu News