chidambaram: చిదంబరం ప్రధాన నిందితుడిగా మరో చార్జ్ షీట్ నమోదు చేసిన ఈడీ

  • ఎయిర్ సెల్-మాక్సీస్ మనీ ల్యాండరింగ్ కేసులో అనుబంధ చార్జ్ షీట్  
  • చార్జ్ షీట్ లో మొత్తం 9 మంది పేర్లు నమోదు
  • ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి ఊరట

ఎయిర్ సెల్-మాక్సిస్ మనీ ల్యాండరింగ్ కేసులో మాజీ మంత్రి పి.చిదంబరంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ గురువారం చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో దాఖలైన ఈ అనుబంధ అభియోగ పత్రంలో చిదంబరాన్ని ప్రధాన నిందితుడిగా (ఏ 1) పేర్కొన్న ఈడీ... ఎస్. భాస్కర్ మన్, మాక్సీస్ కంపెనీకి చెందిన నలుగురితోపాటు మొత్తం తొమ్మిది మంది పేర్లను చేర్చింది. సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ. సైనీ ఈ చార్జ్ షీట్ ను నవంబర్ 26న పరిశీలించనున్నారు.

ఢిల్లీ హైకోర్టులో చిదంబరానికి ఊరట 

ఐఎన్ ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి పి. చిదంబరానికి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ, ఈడీ అరెస్ట్ పై ఢిల్లీ హైకోర్టు గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిలు గడువు ముగియడంతో ఈ గడువును మరింత పెంచింది. నవంబర్ 29 వరకు అరెస్ట్ చేయవద్దంటూ చిదంబరానికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

ఇదిలావుండగా 2007లో యూపీఏ ప్రభుత్వంలో ఆర్థికశాఖ మంత్రిగా పనిచేసిన చిదంబరంపై పలు ఆరోపణలు వచ్చాయి. మీడియా మాజీ ప్రముఖుడు పీటర్ ముఖర్జీ, ఇంద్రాణి ముఖర్జీలకు చెందిన ఐఎన్ ఎక్స్ మీడియాకు అనుమతుల జారీ విషయంలో చిదంబరంతోపాటు ఆయన కొడుకు కార్తీ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులపై సీబీఐ, ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News