Governer: నరేంద్ర మోదీతో పావుగంట పాటు నరసింహన్ సమావేశం... జగన్ పై దాడి గురించే చర్చ!
- గురువారం ఢిల్లీకి వెళ్లిన నరసింహన్
- మోదీ, ధోవల్ తో భేటీ
- రామ్ నాథ్ కోవింద్ తోనూ సమావేశం
గురువారం రాత్రి న్యూఢిల్లీ చేరుకున్న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, నిన్నంతా బిజీగా గడిపారు. ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ అయిన ఆయన, దాదాపు పదిహేను నిమిషాల సేపు మాట్లాడారు. వైఎస్ఆర్ కాాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై ఎయిర్ పోర్టులో జరిగిన దాడి గురించే ప్రధానంగా వీరిద్దరూ చర్చించినట్టు తెలుస్తోంది.
దాడి తీరు, డీజీపీ తనకు ఇచ్చిన సమాచారాన్ని మోదీకి తెలిపిన గవర్నర్, రాష్ట్రంలో శాంతి భద్రతలపైనా తన అభిప్రాయాలు చెప్పారని పీఎంఓ వర్గాలు వెల్లడించాయి. దాడి ఘటనను మోదీకి నరసింహన్ వివరించారు. ఇక ఆ సమయంలో అక్కడే ఉన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తోనూ నరసింహన్ సమావేశం అయ్యారని తెలుస్తోంది. ఆపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను, ఎంపీ లగడపాటి రాజగోపాల్ ను నరసింహన్ కులుసుకున్నారు.