BJYM: స్వశక్తి భారత్‌ నిర్మాణం వైపు యువత అడుగులు : కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

  • సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో బీజేవైఎం జాతీయ మహాసభలు ప్రారంభం
  • దక్షిణ భారత దేశంలో తొలిసారి తెలంగాణలో నిర్వహణ
  • దేశం నలుమూలల నుంచి 40వేల మంది ప్రతినిధుల హాజరు

స్వశక్తి భారత్‌ నిర్మాణానికి యువత ఉత్సాహం చూపుతోందని, ప్రపంచీకరణ దిశగా యువశక్తి ఉత్సాహంగా కదులుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. భారతీయ జనతా పార్టీ యువమోర్చా జాతీయ మహా సభలు నేడు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ప్రారంభమయ్యాయి. సభలను ప్రారంభించిన రాజ్‌నాథ్‌ అనంతరం మాట్లాడుతూ స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

కాగా, దక్షిణ భారత దేశంలో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ సభలకు దేశం నలుమూలల నుంచి 40 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. వీరితోపాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు  హాజరుకానున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు విజయ సూచకంగా హైదరాబాద్‌ కేంద్రంగా ఈ మహా సభలను రెండు రోజులపాటు నిర్వహిస్తున్నారు. భారీగా తరలివచ్చిన ప్రతినిధులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.

  • Loading...

More Telugu News