raghu: అందుకే నేను బరువు తగ్గడం లేదు: కమెడియన్ రఘు
- నా పర్సనాలిటీ చూసే వేషాలు వచ్చాయి
- ఇంతవరకూ 170 సినిమాలు చేశాను
- ముందుగా ప్రిపేర్ కావడం వుండదు
తెలుగు తెరపై విలన్ గ్యాంగ్ లో కామెడీని పండించే సహజ నటుడిగా రఘు కరుమంచి కనిపిస్తాడు. భారీ పర్సనాలిటీతో .. తనదైన డైలాగ్ డెలివరీతో ఆయన మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. అలాంటి రఘు ఐడ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించాడు.
"నాకు వచ్చిన వేషాలన్నీ కూడా నా పర్సనాలిటీ చూసే వచ్చాయి. నేను ఎప్పుడైనా బరువు తగ్గుదామని ఓ పది కేజీలు తగ్గగానే, 'ఎందుకురా తగ్గావు .. తగ్గితే వేషాలు పోతాయి' అని సన్నిహితులు అంటున్నారు. దాంతో బరువు తగ్గకుండా అలాగే మెయింటేన్ చేస్తూ వస్తున్నాను. ఇప్పటికి 170 సినిమాలు చేశాను .. ఇంకో 170 సినిమాలు చేయగలననే నమ్మకం వుంది. పాత్ర ఏదైనా దాని గురించి ముందుగా ఆలోచిస్తూ .. సాధన చేస్తూ కూర్చోను. డైలాగ్ పేపర్ చేతికి వచ్చాక చూసుకుని .. డైరెక్టర్ కి కావలసిన అవుట్ ఫుట్ ను ఇస్తాను" అని చెప్పుకొచ్చాడు.