Anantapur District: తుంగభద్ర పరీవాహకంలో పెన్నహోబిళం వద్ద సుందర జలపాతం
- అనంతపురం జిల్లాలో ప్రత్యేక ఆకర్షణ
- పర్యాటకులకు కనువిందు చేస్తున్న నీటి సవ్వడులు
- జిల్లా వాసులతోపాటు కర్ణాటక నుంచి భారీగా సందర్శకులు
అనంతపురం జిల్లాలో ఓ సందర్శక స్థలం రూపుదిద్దుకుంటోంది. తుంగభద్ర పరీవాహకంలో పెన్నహోబిళం వద్ద కనువిందు చేస్తున్న జలపాతం పర్యాటకులను ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. జిల్లా వాసులతోపాటు కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివస్తుండడంతో నిత్యం జనసందోహం కనిపిస్తోంది.
జిల్లాలోని ఉరవకొండ సమీపంలో పెన్నహోబిళం వద్ద కొండల నడుమ నుంచి జాలువారుతున్న తుంగభద్రమ్మ గలగలలు ఆకట్టుకుంటున్నాయి. తుంగభద్ర నుంచి జిల్లాలోని ఎంపీఆర్ జలాశయానికి వెళ్లే నీరు కొండకోనల గుండా ప్రవహిస్తూ ఇక్కడి ఎత్తయిన రాళ్ల మీదుగా జాలువారుతుండడం జలపాతాన్ని తలపిస్తోంది.
ఇక్కడ ప్రఖ్యాత దేవాలయ సముదాయం కూడా ఉండడంతో సందర్శకులు ఆధ్యాత్మిక, పర్యాటక ఆనందానుభూతిని పొందుతున్నారు. సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడుతున్నారు. కొందరు లఘుచిత్రాలు షూటింగ్కు ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు.