EX Husband: మా నాన్న చాలా క్రూరుడు.. ఉరిశిక్ష విధించండి: అక్కాచెల్లెళ్ల పోరాటం
- గతవారం మాజీ భార్యను హతమార్చిన భర్త
- మరణశిక్ష విధించాలని కోరుతూ కూతుళ్ల లేఖ
- మద్దతుగా దాదాపు లక్షన్నర మంది సంతకం
దక్షిణ కొరియాలో గత వారం అపార్ట్మెంటులో కారు పార్క్ చేస్తుండగా ఓ మహిళను ఆమె మాజీ భర్త దారుణంగా హత మార్చాడు. దీనిపై నిందితుడికి మరణశిక్ష విధించాలని కోరుతూ ఆయన కూతుళ్లు అధ్యక్ష భవనానికి ఓ లేఖ అందజేశారు.
‘మా నాన్న చాలా క్రూరుడు. ఈ సమాజంలో జీవించే అర్హత ఆయనకు లేదు. మరొకరు ఇలాంటి దారుణానికి పాల్పడకూడదనే ఉరిశిక్ష విధించాలని మేము నిరసనకు పూనుకున్నాం’ అంటూ ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లు లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖకు మద్దతుగా దాదాపు లక్షన్నర మంది సంతకం చేశారు. దీంతో అక్కడిది హాట్ టాపిక్‌గా మారింది. దక్షిణ కొరియాలో మరణ శిక్షణను నిలిపివేశారు. మరి ఈ అక్కా చెల్లెళ్ల పోరాటంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.