Jagan: ఈ నెల 5న రాష్ట్రపతిని కలవనున్న వైసీపీ నేతలు.. అపాయింట్మెంట్ ఖరారు
- 5న ఉదయం 11:30 గంటలకు రాష్ట్రపతి అపాయింట్మెంట్
- దాడి ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తును కోరనున్న నేతలు
- కత్తి దాడి గురించి వివరించనున్న వైసీపీ
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్టణంలో జరిగిన కత్తి దాడి, అనంతర పరిణామాల గురించి వివరించేందుకు వైసీపీ నేతలు రాష్ట్రపతిని కలవనున్నారు. ఈ మేరకు వారికి అపాయింట్మెంట్ ఖరారైంది. 5న ఉదయం 11:30 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్న నేతలు.. జగన్‌పై దాడి కేసులో నిష్పాక్షిక విచారణ జరిపించాలని కోరనున్నారు. జగన్‌పై దాడి అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు.
జగన్‌పై దాడి కేసును దర్యాప్తు చేస్తున్న ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని జగన్ ఇప్పటికే ప్రకటించారు. జాతీయ దర్యాప్తు సంస్థలతో కానీ, లేదంటే మరే ఇతర సంస్థతో అయినా దర్యాప్తు జరిపించాలని జగన్ కోరారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది.