jayalalitha: నేను ఆస్పత్రికి వెళ్లే సరికి జయలలిత అపస్మారక స్థితిలో ఉన్నారు: మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు వాంగ్మూలం
- వైద్యులను అడిగి ఆమె చికిత్స వివరాలు తెలుసుకున్నాను
- ఆ వివరాలతో రాష్ట్రపతికి లేఖ కూడా రాశాను
- జస్టిస్ ఆర్ముగం కమిటీకి నివేదిక
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఆర్ముగస్వామి కమిటీకి మహారాష్ట్ర గవర్నర్, అప్పట్లో చెన్నై ఇన్చార్జి గవర్నర్‌గా పనిచేసిన సిహెచ్.విద్యాసాగర్‌రావు తన వాంగ్మూలానికి సంబంధించిన నివేదికను సమర్పించారు. ‘జయలలిత అస్వస్థురాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యంపై వదంతులు వ్యాపించడంతో నేను 2016 అక్టోబరు 1న అపోలో ఆస్పత్రికి వెళ్లాను. నేను ఆస్పత్రికి వెళ్లేసరికి ఆమె అపస్మారక స్థితిలో ఉన్నారు. దీంతో నేరుగా మాట్లాడే అవకాశం లేక వైద్యులను అడిగి చికిత్స వివరాలు తెలుసుకున్నాను’ అని ఆ నివేదికలో తెలిపారు.
తానూ ఆస్పత్రిని సందర్శించిన అనంతరం జయలలితకు ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై రాష్ట్రపతికి లేఖ రాసినట్లు తెలిపారు. జయలలిత ఆస్పత్రిలో చేరిన పదిహేను రోజుల తర్వాత ఈ లేఖ పంపినట్లు వివరించారు.