siricilla: చేనేత కార్మికులు కాదు, చేనేత కళాకారులు: మంత్రి కేటీఆర్

  • ఎటువంటి నైపుణ్య శిక్షణా తరగతులు లేకుండానే అద్భుతంగా నేస్తారు
  • అందుకే, వారు చేనేత కళాకారులు
  • చేనేత, జౌళి పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నా

ఎటువంటి నైపుణ్య శిక్షణా తరగతులు లేకుండానే అద్భుతమైన వస్త్రాలను నేతన్నలు తయారు చేస్తారని, అందుకే, వారిని చేనేత కార్మికులు అని కాకుండా చేనేత కళాకారులు అని పిలవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. రాజన్న సిరిసిల్లలో పద్మశాలి వస్త్ర పరిశ్రమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కృతజ్ఞత సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగిస్తూ, పద్మశాలీలు తమపై చూపిస్తున్న అభిమానాన్ని జీవితాంతం మరిచిపోలేనని అన్నారు. సిరిసిల్ల బతుకమ్మ చీరలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలంతా గర్వంగా తమ గుండెలకు అద్దుకుంటున్నారని ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు.

నేతన్నల కష్టాలు ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా సీఎం కేసీఆర్ వారిని ఆదుకునేందుకు అనేక చర్యలు చేపట్టారని అన్నారు. నేతన్నలను సంక్షోభం నుంచి సంక్షేమం వైపు తీసుకెళ్లేందుకు కేసీఆర్ ఎంతో పాటుపడుతున్నారని; చేనేత, జౌళి పరిశ్రమల అభివృద్ధికి తాను కూడా తన వంతు కృషి చేస్తున్నానని అన్నారు.

  • Loading...

More Telugu News