Narendra Modi: చంద్రబాబు 'కూటమి'పై తొలిసారి స్పందించిన నరేంద్ర మోదీ!

  • వారసుల కోసమే కూటములు
  • ప్రజలు ఎవరినీ నమ్మరు
  • జాతీయ ఫ్రంట్ పై కామెంట్లు

బీజేపీతో విడిపోయిన తరువాత, చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. విపక్షాలన్నీ కలసి ఓ కూటమిని ఏర్పాటు చేసుకోవడం వెనుక, వారసత్వ రాజకీయాలు దాగున్నాయని, తమ తమ వారసులను అధికార పీఠాలపై కూర్చోబెట్టేందుకే విపక్ష నేతలంతా కలుస్తున్నారని చెప్పారు.

"ఆ పార్టీలకు, నేతలకు అనువంశిక పాలనే ముఖ్యం. దేశ గతిని మార్చడం మన లక్ష్యం. వారికీ మనకూ ఎంత తేడా? కేవలం కొడుకులకు అధికారాన్ని మిగిల్చేందుకు బీజేపీ వ్యతిరేక కూటమి పేరుతో జట్టు కడుతున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పాలనా పగ్గాలను ఈ వంశాలు తమ అధీనంలోనే ఉంచుకున్నాయి" అని అన్నారు.

తమ పార్టీ మరో ఐదేళ్లు అధికారంలో ఉంటే, వంశపాలన సాగేందుకు మార్గం ఉండదని దేశంలోని 500 వరకూ ఉన్న వంశాలు భయపడుతున్నాయని విమర్శించారు. ఎవరి పేరునూ ఎత్తకుండానే జాతీయ ఫ్రంట్ పై స్పందించిన మోదీ, వారసులను గద్దెపై నిలిపేందుకు పలువురు తనకు వ్యతిరేకంగా చేతులు కలుపుతున్నారని వ్యాఖ్యానించారు. వారి కూటముల గురించి ఆలోచన వద్దని, ఎవరికీ ప్రజల ఆమోదం లేదని చెప్పారు.

  • Loading...

More Telugu News