Madhu Yashki: టీఆర్ఎస్ పేలని టపాకాయ.. తుస్సుమని తుడుచుకుపోతుంది!: మధుయాష్కీ

  • పొత్తు పెట్టుకుంటే టీఆర్ఎస్‌కు ఉలుకెందుకు?
  • రైతు ఆత్మహత్యలకు కారణమయ్యారు
  • నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు

డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పేలని టపాకాయ అని.. తుస్సుమని తుడుచుకుని పోతుందని కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ ఎద్దేవా చేశారు. నేడు ఆయన గాంధీ భవన్‌లో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు తమ పార్టీతో పొత్తు పెట్టుకుంటే టీఆర్ఎస్‌ ఎందుకు ఉలిక్కి పడుతోందో అర్థం కావట్లేదన్నారు. నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం సాధించిందని ఆయన ప్రశ్నించారు.

బంగారు తెలంగాణ పేరుతో రైతు ఆత్మహత్యలకు కారణమయ్యారని ఆరోపించారు. నిరుద్యోగులు ఉపాధిలేక రైలుకింద పడి ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. టీఆర్ఎస్ చిచ్చుబుడ్డిలాంటిదని పైకి ఎగిరి తుస్సుమంటుందన్నారు. హామీలను ఎంతవరకు నెరవేర్చారో, ఏ మేరకు అభివృద్ది చేశారనే అంశంపై చర్చకు రావాలని మధుయాష్కీ సవాల్ విసిరారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర ఆస్తులను కాపాడుకునేందుకు కూటమిగా ఏర్పడ్డామన్నారు.

  • Loading...

More Telugu News