Tamilnadu: సుప్రీంకోర్టు ఆదేశాలను ఏమాత్రం ఖాతరు చేయని తమిళ తంబీలు!
- 2 గంటల పాటు మాత్రమే టపాకాయలు కాల్చాలి
- సుప్రీంకోర్టు ఆదేశాలపై మండిపడుతున్న యువత
- రోడ్లపైకి వచ్చి మరీ పండగ చేసుకుంటున్న యువత
దీపావళి సందర్భంగా కేవలం 2 గంటల పాటు మాత్రమే టపాకాయలు కాల్చుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తమిళనాడు వాసులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. తమ మనోభావాలకు ఈ ఆదేశాలు వ్యతిరేకమని అంటున్నారు.
సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా ఉదయం 6 నుంచి 7 వరకు, రాత్రి 7 నుంచి 8 వరకు టపాకాయలు కాల్చుకోవచ్చని తమిళనాడు సర్కారు ఆదేశాలు జారీ చేయగా, రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ వీటిని పాటించిన పరిస్థితి కనిపించలేదు. నరక చతుర్దశి సందర్భంగా గతంలో ఎన్నడూ లేనంతగా రోడ్లపైకి వచ్చిమరీ టపాకాయలు కాల్చారు యువత. నేడు, రేపు తాము దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటామని చెబుతున్నారు.