Andhra Pradesh: జగన్ పై హత్యాయత్నం.. రేపు మీడియా ముందుకు రానున్న వైఎస్ ఫ్యామిలీ!

  • హాజరుకానున్న కుటుంబ సభ్యులు
  • దాడి తదనంతర ఘటనలపై వివరణ
  • 12న పాదయాత్రలో పాల్గొననున్న జగన్

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై గత నెల 25న ఓ యువకుడు హత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి తర్వాత ఆపరేషన్ చేయించుకున్న జగన్ విశ్రాంతి తీసుకుని సోమవారం నుంచి ప్రజాసంకల్పయాత్రలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ మౌనంగా ఉన్న జగన్ కుటుంబ సభ్యులు రేపు మీడియా ముందుకు రానున్నారు.

వైసీపీ గౌరవ అధ్యక్షురాలు, వైఎస్ జగన్ తల్లి విజయమ్మ రేపు ఉదయం 11 గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. జగన్ పై దాడి జరిగాక టీడీపీ నేతల వ్యవహారశైలి, ఎదురుదాడి సహా పలు అంశాలపై విజయమ్మ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి మిగతా కుటుంబ సభ్యులు కూడా హాజరు కానున్నారు. గత నెల 25న విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై శ్రీనివాసరావు అనే యువకుడు హత్యాయత్నం చేశాడు.

ఈ ఘటనలో జగన్ ఎడమచేతికి 9 కుట్లు పడ్డాయి. ఈ దాడిని టీడీపీ నేతలే చేయించారని వైసీపీ నాయకులు ఆరోపించగా, సానుభూతి కోసం వైసీపీ నేతలే ఈ దాడి చేయించుకున్నారని అధికార పార్టీ నేతలు విమర్శించారు.

  • Loading...

More Telugu News