vijay vdevarakonda: బన్నీలాగా నేను ఈ జీవితంలో డాన్స్ చేయలేను: విజయ్ దేవరకొండ
- విజయ్ దేవరకొండ బెస్ట్ పెర్ఫార్మర్
- ఆయనలోని ఒరిజినాలిటీని ఇష్టపడుతున్నారు
- అంచలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాడు
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో 'టాక్సీవాలా' నిర్మితమైంది. ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ వేదికపై విజయ్ దేవరకొండ ఎప్పటిలానే తన సహజమైన ధోరణిలో మాట్లాడాడు.
ఈ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన బన్నీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశాడు. బన్నీలాగా తాను ఈ జీవితంలో డాన్స్ చేయలేననీ, అలాంటి డాన్స్ ఒకటి తన సినిమాలో ఉండాలంటే అది గ్రాఫిక్స్ తో మాత్రమే సాధ్యమవుతుందంటూ ప్రశంసించాడు. ఆ తరువాత బన్నీ మాట్లాడుతూ .. విజయ్ దేవరకొండ బెస్ట్ పెర్ఫార్మర్ అని అన్నాడు. ఎవరి అండదండలు లేకుండగా ఈ స్థాయికి చేరుకున్నాడనీ, ఆయనని ఇంతమంది ఇష్టపడటానికి కారణం ఆయనలోని ఒరిజినాలిటీ అని చెప్పుకొచ్చాడు.