Revanth Reddy: నాలుగు సీట్లతో పట్టు నిలుపుకున్న రేవంత్... దొమ్మాటికి నిరాశ, తేలని అరికెల భవితవ్యం!
- ములుగు నుంచి సీతక్క, చొప్పదండి నుంచి మేడిపల్లి
- పెద్దపల్లి నుంచి విజయరమణారావుకు చాన్స్
- ఇతర నేతల నుంచి పోటీ వచ్చినా పట్టు నిలుపుకున్న రేవంత్
తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగిన రేవంత్ రెడ్డి, తన వర్గంలోని నలుగురికి కాంగ్రెస్ తొలి జాబితాలో స్థానం దక్కించుకోగలిగారు. కొడంగల్ నుంచి తనకు, ములుగు నుంచి సీతక్క, చొప్పదండి నుంచి మేడిపల్లి సత్యం, పెద్దపల్లి నుంచి విజయ రమణారావులకు టికెట్లు లభించాయి.
చొప్పదండి, ములుగులో ఇతర నేతల నుంచి గట్టి పోటీ ఎదురైనా రేవంత్ తన పట్టును నిలుపుకున్నారు. ఇక రేవంత్ తో పాటే కాంగ్రెస్ లో చేరిన దొమ్మాటి సాంబయ్య స్టేషన్ ఘనపూర్ టికెట్ ను ఆశించగా, ఆయన ఆశ తీరలేదు. నిజామాబాద్ అర్బన్ స్థానాన్ని రేవంత్ వర్గంలోని మరో నేత అరికెల నర్సారెడ్డి అడుగుతుండగా, ఈ స్థానాన్ని కాంగ్రెస్ పెండింగ్ లో పెట్టింది.