ys jagan: జగన్ నోరువిప్పకపోతే విచారణ ఎలా సాగుతుంది?: టీడీపీ నేత వర్ల
- వాస్తవాలు చెప్పడానికి జగన్ కు ఎందుకు భయం?
- నిందితుడి ఫోన్ కాల్స్ పై విచారణ జరపాలి: వర్ల
- ఏపీలో సెంటిమెంట్ రాజకీయాలు: సీపీఐ నారాయణ
వైసీపీ అధినేత జగన్ తనపై జరిగిన దాడి విషయమై నోరువిప్పకపోతే విచారణ ఎలా సాగుతుందని ఏపీ టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలు చెప్పడానికి జగన్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. నిందితుడు శ్రీనివాసరావు ఫోన్ కాల్స్ పై విచారణ జరపాలని అన్నారు.
మరోపక్క, ఏపీలో సెంటిమెంట్ రాజకీయాలు నడుస్తున్నాయని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. జగన్ పై దాడి తర్వాత చంద్రబాబు, డీజీపీ స్పందన సరిగా లేదని, అలాగే జగన్ పై దాడి చంద్రబాబే చేయించారన్న ప్రచారాన్ని ఆపకపోతే వైసీపీకే నష్టమని సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశం గురించి ప్రస్తావిస్తూ, మోదీ ఇవ్వరని గతంలో చెప్పినా చంద్రబాబు వినలేదని అన్నారు. మోదీ కారణంగానే కాంగ్రెస్-టీడీపీలు ఒక్కటయ్యాయని అన్నారు.