Danam Nagender: ఒకప్పటి తన శత్రువులను వరుసగా కలుస్తున్న దానం నాగేందర్!

- గతంలో కాంగ్రెస్ లో ఉన్న దానం
- 2004 ఎన్నికల్లో విజయరామారావుతో పోటీ
- 2014లో విజయారెడ్డికి సవాల్
- ఇప్పుడంతా టీఆర్ఎస్ లోనే
గతంలో ఎన్నికల్లో తనతో పోటీ పడిన పలువురు నేతలు ఇప్పుడు స్నేహితులుగా మారగా, తనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ వారందరినీ వరుసబెట్టి కలుస్తున్నారు దానం నాగేందర్, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఆయన ప్రస్తుతం ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.
కాగా, 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఖైరతాబాద్ నియోజకవర్గంలో సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు నిలబడగా, కాంగ్రెస్ తరఫున దానం నిలబడ్డారన్న సంగతి తెలిసిందే. ఆపై 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా దానం పోటీపడ్డారు. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వీరంతా ఇప్పుడు టీఆర్ఎస్ లోనే ఉన్నారు.
దీంతో విజయానికి నాటి తన ప్రత్యర్థుల మద్దతు అవసరమని భావిస్తున్న దానం, వీరి ఇళ్లకు వెళ్లి మద్దతు ఇవ్వాలని, తన తరఫున ప్రచారం చేయాలని కోరుతున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఎన్నడూ ఉండరని దానం మరోసారి నిరూపించారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.