KTR: తెలంగాణ భవన్ కళకళలాడుతోంది.. గాంధీభవన్ అట్టుడుకుతోంది: మంత్రి కేటీఆర్

  • గాంధీభవన్ లో బౌన్సర్లను పెట్టుకున్నారు
  • టీఆర్ఎస్ గెలుపు ఖాయం
  • ప్రగతి చక్రం ఆగకూడదంటే కేసీఆరే మళ్లీ సీఎం కావాలి

ప్రతిరోజూ చేరికలతో తెలంగాణ భవన్ కళకళలాడుతుంటే.. గాంధీభవన్ మాత్రం ఆందోళనలతో అట్టుడుకుతోందని మంత్రి కేటీఆర్ సెటైర్లు విసిరారు. కేటీఆర్ సమక్షంలో జగిత్యాల ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ లక్ష్మణ్, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ తిరుమలరావు, బీజేపీ కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యదర్శి తిరుపతిరెడ్డిలు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.

ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ, ఆందోళనలతో అట్టుడుతుకున్న గాంధీభవన్ లో దాడులు జరగకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు బౌన్సర్లను పెట్టుకున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా త్వరలో జరగనున్న ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ, 2014 ఎన్నికల్లో కరీంనగర్ జిల్లాలో 13కు 12 స్థానాలు గెలిచామని, ఈసారి మాత్రం అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పనులను యావత్తు ప్రపంచం గుర్తించిందని, తెలంగాణలో ప్రగతి చక్రం ఆగొద్దంటే, కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని అన్నారు.

  • Loading...

More Telugu News