Varavara Rao: వరవరరావుకు ఈ నెల 26 వరకు పోలీస్ కస్టడీ
- మావోయిస్టు అగ్రనేత గణపతి రహస్య స్థావరం ఆయనకు తెలుసన్న న్యాయవాది
- 14 రోజుల పోలీసు కస్టడీకి అనుమతివ్వాలని అభ్యర్థన
- 9 రోజులకు అనుమతించిన కోర్టు
విరసం సభ్యుడు వరవరరావును ఈ నెల 26 వరకు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ పూణెలోని జిల్లా సెషన్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు విధించిన గృహనిర్బంధం ఈ నెల 15న ముగిసిన నేపథ్యంలో శనివారం పూణె పోలీసులు హైదరాబాద్లో వరవరరావును అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అనంతరం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ.. మావోయిస్టు అగ్రనేత గణపతి రహస్య స్థావరాలతోపాటు మావోల లేఖల్లో ఉన్న కోడ్భాష గురించి విచారించేందుకు వరవరరావును పోలీసు కస్టడీకి అప్పగించాలని కోరారు. వాదనలు విన్న కోర్టు 9 రోజులపాటు వరవరరావును పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మావోయిస్టులతో సంబంధాలున్న కేసులో వరవరరావు ఇది వరకే ఓసారి అరెస్టైన సంగతి తెలిసిందే.