Rahul Gandhi: మోదీ భస్మాసుర హస్తం... నేడు ఆర్బీఐ వంతు: రాహుల్ గాంధీ
- చెయ్యి పడిన ప్రతి సంస్థ నాశనమే
- నేడు ఆర్బీఐ నాశనానికి యత్నం
- మోదీపై విమర్శలు గుప్పించిన రాహుల్
తనకు అవకాశం చిక్కినప్పుడల్లా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పిస్తుండే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మరోసారి నిప్పులు చెరిగారు. నరేంద్ర మోదీది భస్మాసుర హస్తమని, ఆ చెయ్యి పడిన ప్రతి సంస్థా సర్వనాశనమేనని అన్నారు. నేడు ఆర్బీఐని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు.
నరేంద్రమోదీ, ఆయన కోటరీ దేశంలోని ప్రతి ఇనిస్టిట్యూషన్ నూ నాశనం చేస్తోందని అన్నారు. నేడు ఆయన చెప్పినట్టు ఆడే తోలుబొమ్మలు, ఆర్బీఐ బోర్డు మీటింగ్ పై కన్నేశాయని ఆరోపించారు. ఉర్జిత్ పటేల్, ఆయన టీమ్, ధైర్యంగా నిలిచి, ఈ కుట్రను అడ్డుకుంటారని భావిస్తున్నానని అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో రాహుల్ ఓ ట్వీట్ ఉంచారు.
Mr Modi and his coterie of cronies, continue to destroy every institution they can get their hands on. Today, through his puppets at the #RBIBoardMeet he will attempt to destroy the RBI. I hope Mr Patel and his team have a spine and show him his place.
— Rahul Gandhi (@RahulGandhi) November 19, 2018