L. Ramana: టీడీపీ తెలంగాణ అధ్యక్షుడి సమక్షంలో కార్యకర్తల మధ్య ఘర్షణ
- దీపక్ రెడ్డి, బీఎన్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ
- ఘర్షణకు దారి తీసిన మాటల యుద్ధం
- ఇరు వర్గాల మధ్య తోపులాట
- పరిస్థితిని అదుపు చేసిన రమణ
టికెట్ దక్కించుకున్న నేతలు, టికెట్ రాక భంగపడ్డ నేతలకు చెందిన ఇరు వర్గాలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలోనే బాహాబాహాకి పాల్పడ్డాయి. నేడు టీడీపీ భవన్లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. నేడు ఖైరతాబాద్ కార్యకర్తలతో రమణ టీడీపీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటిలో దీపక్ రెడ్డి, బీఎన్ రెడ్డి వర్గీయుల మధ్య జరిగిన మాటల యుద్ధం ఘర్షణకు దారి తీసింది. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాటలతో పరిస్థితి అదుపు తప్పడంతో రమణ కల్పించుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పి పరిస్థితిని అదుపు చేశారు.