Amritsar: నిర్లక్ష్యమే ఆ 60 మంది ప్రాణాలు తీసింది.. అమృత్‌సర్ రైలు ప్రమాదంపై తేల్చి చెప్పిన నివేదిక

  • ప్రజల నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది
  • రైల్వే తప్పు ఎంతమాత్రమూ లేదు
  • భవిష్యత్తులో మరోమారు జరగకుండా చర్యలు తీసుకోవాలి
దసరా రోజు అమృత్‌సర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై దర్యాప్తు నివేదిక సంచలన విషయం వెల్లడించింది. రావణ దహనాన్ని వీక్షిస్తున్న ప్రజలపై నుంచి రైలు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 60 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంపై రైల్వే భద్రత విభాగం చీఫ్ కమిషనర్ ఎస్‌కే పాఠక్ మధ్యంతర నివేదికను విడుదల చేశారు. ప్రమాదంలో రైల్వే నిర్లక్ష్యం ఎంతమాత్రమూ లేదని, ప్రజల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని దర్యాప్తు నివేదిక వెల్లడించింది. ఆ మార్గంలో ‘ఎస్’ మలుపు ఉండడం వల్ల ప్రమాద ఘటనకు 250 మీటర్ల దూరం వరకు వచ్చే వరకు అక్కడేం జరుగుతుందో డ్రైవర్‌కు కనిపించదని పేర్కొంది.

అక్టోబరు 19 సాయంత్రం 6:55 గంటలకు అమృత్‌సర్ రైల్వే స్టేషన్ సమీపంలోని జౌరా-ఫాటక్ వద్ద ప్రమాదం జరిగిందని పేర్కొంది. ప్రజలు రావణ దహనాన్ని చూస్తూ పట్టాలపై నిల్చున్నారని వివరించింది. ప్రమాదంలో 60 మంది మృతి చెందారని, ఈ ఘోర దుర్ఘటనకు ప్రజల నిర్లక్ష్యమే కారణమని పేర్కొంది. రైల్వే లైన్ సమీపంలో ప్రజలు వ్యవహరించే తీరులోనే పొరపాటు ఉందని, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని నివేదిక సూచించింది.
Amritsar
train
tragedy
probe
trespassers
Dussehra

More Telugu News