ranveer: పెళ్లయిన పది రోజులకే.. డబ్బింగ్ చెప్పేందుకు వచ్చేసిన రణ్ వీర్

  • 'టెంపర్' రీమేక్ గా 'సింబా'
  • దర్శకుడిగా రోహిత్ శెట్టి 
  • వచ్చేనెల 28న విడుదల  

తెలుగులో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'టెంపర్' ఆయన అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. దాంతో ఈ సినిమాను తమిళంలో 'అయోగ్య' టైటిల్ తో విశాల్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఇక హిందీలో 'సింబా' టైటిల్ తో రణ్ వీర్ సింగ్ హీరోగా ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో తన పాత్రకి డబ్బింగ్ చెప్పడానికి రణ్ వీర్ సింగ్ రంగంలోకి దిగిపోయాడు.

ఈ నెల 14వ తేదీనే రణ్ వీర్ సింగ్ - దీపికా పదుకొనె వివాహం జరిగింది. వివాహమైన 10 రోజుల్లోనే 'సింబా'కి డబ్బింగ్ చెప్పడానికి రణ్ వీర్ వచ్చేశాడు. డిసెంబర్ 28వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విడుదలకి పెద్దగా సమయం లేదు. అందువలన డబ్బింగ్ పనులను పూర్తిచేసే పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగానే డబ్బింగ్ చెప్పడానికి రణ్ వీర్ వచ్చేశాడు. ఆ సమయంలో దర్శకుడు రోహిత్ శెట్టితో అక్కడ తీసుకున్న సెల్ఫీని రణ్ వీర్ సింగ్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.   

  • Loading...

More Telugu News