Election commission: నగదు రూపంలో ఖర్చయినా, స్వీకరణ అయినా రోజుకి రూ.10వేలే : ఎన్నికల సంఘం ఆంక్షలు

  • తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఆదేశాలు జారీ చేసిన ఈసీ
  • అంతకు మించితే అకౌంట్‌ పే తప్పనిసరి
  • రూ.20 వేలున్న నిబంధనను సగానికి తగ్గించిన అధికారులు

అభ్యర్థుల ఎన్నికల వ్యయం, విరాళాల స్వీకరణపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఎన్నికల్లో నగదు రూపంలో ఖర్చు చేసినా, విరాళంగా స్వీకరించాలన్నా రోజుకి పది వేల రూపాయలకే అనుమతిచ్చింది. అంతకు మించితే అకౌంట్‌ బేస్‌గా జరగాలని ఆదేశించింది. అంటే చెక్‌, డీడీ, ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ రూపంలో లావాదేవీలు కొనసాగించాలని సూచించింది.

గతంలో రోజుకి రూ.20 వేల వరకు నగదు లావాదేవీలకు ఈసీ అనుమతిచ్చింది. అయితే ఎన్నికల్లో మితిమీరుతున్న ధనప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 40ఎ(3)కు 2017లో చేసిన సవరణల మేరకు ఈ ఆదేశాలు జారీ చేసింది. రోజువారీ నగదు పరిమితిని రూ.20 వేలుగా నిర్ణయిస్తూ 2011లో ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాల్లో తాజా మార్పులు చేసింది.

  • Loading...

More Telugu News