trisha: తన పెళ్లి వార్తల గురించి స్పందించిన త్రిష
- నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటా
- పెళ్లి విషయం దాచాలనుకోవడం లేదు
- పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేయండి
తమిళంలో నటనకి ప్రాధాన్యత కలిగిన పాత్రలను .. నాయిక ప్రాధాన్యత కలిగిన పాత్రలను చేస్తూ, నయనతార తరువాత స్థానంలో త్రిష దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఒక వ్యాపార వేత్తతో త్రిష ప్రేమలో పడిందనీ, త్వరలోనే ఆయనతో ఆమె వివాహం జరగనుందనే టాక్ కోలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. పెళ్లి తరువాత సినిమాలు మానేస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది.
ఈ విషయాలను గురించి తాజాగా త్రిష స్పందించింది. "ప్రస్తుతం నా పెళ్లి గురించి జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజంలేదు. ఈ మధ్య కాలంలో నా గురించి అసత్య ప్రచారాలు ఎక్కువైపోయాయి .. అందులో ఇదొకటి. నాకు నచ్చిన వ్యక్తి తారసపడితే .. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ విషయాన్ని నేనే చెబుతాను. ఈ విషయాన్ని దాచాలని కూడా నేను అనుకోవడంలేదు. ఇక పెళ్లి తరువాత నేను సినిమాలు చేస్తానా .. మానేస్తానా అనేది అప్పుడు తీసుకోవలసిన నిర్ణయం. అందువలన అనవసరమైన ప్రచారాలకు దయచేసి ఫుల్ స్టాప్ పెట్టేయండి" అని చెప్పుకొచ్చింది.